టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటు డిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో నితిన్ ఒక రు. నితిన్ , తేజ దర్శకత్వంలో రూపొందిన జయం అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత నితిన్ అనేక సార్లు అపజయాలను అందుకున్న ఈయన మళ్ళీ విజయాలను అందుకుంటు ఫుల్ ఫామ్ లోకి వస్తున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం నితిన్ కి వరుస పెట్టి అపజయాలు దక్కుతున్నాయి. వరుసగా నితిన్ కి మాచర్ల నియోజకవర్గం , ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ తాజాగా రాబిన్ హుడ్ మూవీ లతో భారీ అపజయాలు దక్కాయి.

ఇకపోతే నితిన్ కొన్ని సంవత్సరాల క్రితం చిన్నదానా నీకోసం అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో మిస్త్రీ చక్రవర్తి హీరోయిన్గా నటించగా ... ఈ మూవీ తోనే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ ఈ మూవీ ద్వారా మిస్త్రీ చక్రవర్తి కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ భారీ క్రేజ్ ఉన్న తెలుగు సినిమాలలో అవకాశాలను దక్కించుకోలేకపోయింది.

ఈ మధ్య కాలంలో మాత్రం ఈ బ్యూటీ తెలుగులో ఏ సినిమాలో కనిపించలేదు. సినిమాల్లో కనిపించకపోయినా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. ఈ బ్యూటీ ఇప్పటికే కూడా అదిరిపోయే రేంజ్ లో అందాలను మెయింటైన్ చేస్తూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mc