
అంతేకాదు అభిమానులు గోల చేస్తుంటే వెళ్ళిపోమంటారా..? అంటూ తనదైన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు . అప్పుడు వెంటనే పక్కనే ఉన్న విజయశాంతి గారు చేయి పట్టుకుని దగ్గరికి లాగుతారు . అంతేకాదు ఈ ఈవెంట్లో అభిమానులకి ఒక న్యూస్ కూడా చెప్పారు . త్వరలోనే ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తామని .. కేవలం ఫ్యాన్స్ కోసం మాత్రమే పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ ఈవెంట్ నిర్వహిస్తానని చెప్పుకొచ్చారు . అయితే ఇది ఏ సినిమాకి సంబంధించింది కాదు అంటూ తెలుస్తుంది. ఇది కేవలం తారక్ తన ఫ్యాన్స్ కోసం మాత్రమే నిర్వహిస్తున్న మీట్ అని.. తారక్ కి ఫ్యాన్స్ మధ్య జరిగే ఈ మీట్ చాలా స్పెషల్ గా ఉండబోతుంది అని తారక్ మాటల్లోనే అర్థమవుతుంది .
అయితే ఇప్పుడు ఇదే బిగ్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . గతంలో తమిళనాడులో రజనీకాంత్ - దళపతి విజయ్ ఇదే తరహాలో కొన్ని కొన్ని ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేసుకున్నారు. తెలుగులో మాత్రం ఎవ్వరు ఇలా చేయలేకపోయారు . జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఇలా చేస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కి ఆల్రెడీ పొలిటికల్ పరంగా కొన్ని ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. ఆయన పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా సరే పొలిటికల్ పరంగా కొన్ని కొన్ని చిక్కులు ఎదుర్కొంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఇలా ఫ్యాన్స్ తో మీట్ ఏర్పాటు చేయడం కొత్త తల నొప్పులు క్రియేట్ అయ్యేలా చేస్తుంది అని .. గతంలో బన్నీ ఏ విధంగా పొలిటికల్ చిక్కుల్లో ఇరుక్కున్నాడో.. జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే చిక్కులో ఇరుకున్నే పరిస్థితి వస్తుందేమో అంటూ కొందరు సినీ ప్రముఖులు వార్న్ చేస్తున్నారు . అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకుఈ మీట్ నిర్వహిస్తున్నాడు అనేది త్వరలోనే తెలిసిపోతుంది..!