- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నట‌సింహం నందమూరి బాలకృష్ణ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే .. ఇక దీంతో ఇప్పుడు ఈ సినిమా కు సీక్వల్ గా అఖండ 2 తాండవం కూడా రాబోతుంది .. ఇప్పటికే ఈ సినిమా పై బారీ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి .. అయితే ఇప్పుడు ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ కూడా ఎంతో వేగంగా జరుగుతుంది .. ఇదే క్రమంలో ఈ సినిమా లోని ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ఓ భారీ సెట్ అయితే రెడీ చేస్తున్నారు .. అలాగే ఈ సెట్ లోనే రెండు వారాల పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ లను కూడా తెరకెక్కిస్తారట .. ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ నేతృత్వం లో ఈ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది ..

అలాగే ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమా మొత్తం లోనే ఎంతో హైలైట్ గా నిలుస్తాయ ని కూడా అంటున్నారు .. అయితే ఈ సినిమా మొత్తం లోనే ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ మెయిన్ హైలెట్ గా అవుతుంద ని కూడా భావిస్తున్నారు .  ప్రస్తుతం హిమాలయాల్లో కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో బాలయ్య అఘోర పాత్ర పై కొన్ని కీలక సన్నివేశాల ను షూట్ చేస్తున్నారు .. అలాగే ఈ సినిమా ను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపి ఆచంట నిర్మిస్తున్నారు .. అలాగే మ్యూజిక్ సెన్సేషన్ నందమూరి త‌మన్ ఈ సినిమా కు సంగీత మందిస్తున్నారు .. అలాగే బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఇప్పటికే హాట్రిక్ విజయాలు నమోదయ్యాయి . ఇక దీంతో అఖండ 2 తాండవం పై కూడా ఊహించ ని రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: