
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబోలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ వార్ 2 .. అయితే తాజా గా జరిగిన ఓ కార్యక్రమంలో హీరో హృతిక్ రోషన్ వార్ 2 తో పాటు ఎన్టీఆర్ గురించి కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు .. ఇంతకీ ఆ కార్యక్రమాల్లో హృతిక్ ఏం మాట్లాడరు అంటే .. వార్ 2 షూటింగ్ కు సంబంధించి ప్రతి షెడ్యూల్ ఎంతో పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు .. అలాగే దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తారు .. అలాగే ఎన్టీఆర్ తో పని చేయడం వల్ల నాకు ఎంతో ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాను . ఎన్టీఆర్ కు నేను ఎప్పటికీ ఎంతో రుణపడి ఉంటాను అంటూ హృతిక్ తన మనసు లో మాటను బయటపెట్టాడు ..
కాగా పాన్ ఇండియా స్థాయి లో ఈ మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీ స్టారర్స్ లో వార్ 2 మొదటి స్థానం లో ఉంది .. అలాగే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయిక అనగానే ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి .. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పై అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే . అలాగే నిర్మాత ఆదిత్య చోప్రా ఈ సినిమా ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు . బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమా లో హీరోయిన్గా నటిస్తుంది .. ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించిన చాలావరకు షూటింగ్ పూర్తయింది .. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది .. అలాగే ఈ సినిమా ను ఇండిపెండెన్స్ డే కానుకగా వచ్చే ఆగస్టు 14 న ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నారు .