సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ గురించి అయితే అసలు చెప్పనవసరం లేదు . గతంలో ఎంతో మంది స్టార్స్ హీరోయిన్గా ఇండస్ట్రీలో రాజ్యమేలేశారు. వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సెకండ్ ఇన్నింగ్స్ లో తమదైన స్టైల్ ముందుకు దూసుకెళ్తున్నారు . కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో హీరోయిన్గా నటిస్తే సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం ఆ హీరోలకి అక్కగా హీరోలకి తల్లిగా హీరోలకి వదిన పాత్రలో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఒక కాంబో నే తెరపై కనిపించబోతుంది అంటూ న్యూస్ బయటకు వచ్చింది .


అది కూడా జూనియర్ ఎన్టీఆర్ నటించే ఫిలిం కావడంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గతంలో ఎంతో మంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు . వాళ్ళందరిలోకి పర్ఫెక్ట్ పెయిర్ అనిపించింది మాత్రం భూమిక అనే చెప్పాలి.  వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది . మరీ ముఖ్యంగా వీళ్ళ కాంబోలో వచ్చిన సింహాద్రి సినిమా ఎవర్ గ్రీన్ హిట్గా ఇండస్ట్రీలో నిలిచిపోయింది.  అయితే ఒకప్పుడు హీరో హీరోయిన్లు గా కనిపించిన ఎన్టీఆర్ - భూమిక .



ఇప్పుడు సినిమాలో మాత్రం బ్రదర్ అండ్ సిస్టర్స్ రోల్ లో కనిపించబోతున్నారట . అది కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. భూమిక ను ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కి సిస్టర్ రోల్ లో చూపించబోతున్నారట . ప్రశాంత్ నీల్ ఇది మొత్తం ఒక ఫ్యామిలీ సెంటిమెంటేడ్ గా తెరకెక్కే సినిమా గా ప్లాన్ చేశారట. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కి  సిస్టర్ క్యారెక్టర్ లో  భూమికను చూస్ చేసుకున్నారు అంటూ ఓ న్యుస్ బయటికి వచ్చింది. దీంతో జనాలు షాక్ అయిపోతున్నారు.  ఒకప్పుడు హీరో హీరోయిన్లు ఇప్పుడు బ్రదర్ అండ్ సిస్టర్స్ ..ఏంటి ఈ రిలేషన్..? అంటూ ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: