పాన్ ఇండియ‌ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమా లను చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు .. ఇప్పటికే ‘ది రాజాసాబ్’,  ఫౌజి సినిమా ల షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లు త్వరలో నే ప్రేక్షకులు ముందుకు తీసుకురావడాని కి ప్రభాస్ ప్రయత్నిస్తున్నాడు .. అలాగే ఈ సినిమా ల తర్వాత ప్రభాస్ తన తర్వాత సినిమా గా పాన్ ఇండియా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో స్పిరిట్ అనే సినిమా లో నటించబోతున్నాడు . 
 

అలాగే ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానుల తో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .. ఇక ఈ సినిమా ని సందీప్ రెడ్డి వంగా పూర్తి పక్క మాస్ వైల్డ్ కాప్‌ డ్రామాగా తీసుకురాబోతున్నారు .. ఈ సినిమాలో ప్రభాస్ రూత్ ప్లస్ పోలీస్ ఆఫీసర్గా విధ్వంసాన్ని క్రియేట్ చేయబోతున్నాడు . అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ కొంత సమయం తీసుకోబోతున్నాడ ని కూడా తెలుస్తుంది .. అలాగే ఈ సినిమా లో ప్రభాస్ స్లిమ్ లుక్ లో కనిపించబోతున్నాడట .. అందుకే ఈ సినిమా ను సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మొదలు పెట్టే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న టాక్ .

 

ఇక ఈ సినిమా షూటింగ్ ఇండియా తో పాటు ప‌లు ఇతర దేశాల్లో తెరకెక్కించే అవకాశం ఉందట .. అందుకే ఈ సినిమాలో కొరియన్ , అమెరికన్ నటులు కూడా నటించబోతున్నట్లు కూడా తెలుస్తుంది .. ఈ విధంగా స్పిరిట్ చిత్రం పూర్తయ్యేసరికి ఎంత సమయం పడుతుంది అనే విషయాన్ని కూడా ఇప్పట్లో అంచనా వేయటం కష్టమ ని కూడా అంటున్నారు ప్రభాస్ అభిమానులు . ఇక మరి సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేపిస్తారో కూడా చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: