ఇక మన చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి అంటే ఆ సినిమాల పై ఉండే అంచనాలు ఊహించని రేంజ్ లో ఉంటాయి .. అయితే కొన్ని సినిమాలు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకోవచ్చు , అలాగే మరికొన్ని సినిమాలు మాత్రం ప్లాప్ టాక్‌ తెచ్చుకుంటాయి .. కానీ కొన్ని సినిమాలు రిలీజ్ అయిన తొలి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న తర్వాత బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి .. ఇక సినిమాలు ఏమిటో ఇక్కడ చూద్దాం .. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే థియేటర్ల వద్ద అభిమానులు సందడి ఊహించిన రేంజ్ లో ఉంటుంది ..


ఇక హీరో చేస్తున్న సినిమాల్లో చాలావరకు మంచి విజయాలు అందుకున్నయి ,, కానీ 2008 లో వచ్చిన జల్సా మూవీ మాత్రం మొదటి రోజు ప్లాప్ టాక్‌ తెచ్చుకుని తర్వాత బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది . అలాగే మరో స్టార్ హీరో ఎన్టీఆర్ హీరోగా ఎన్నో సినిమాల వచ్చాయి .. అయితే ఎన్టీఆర్ , కొరటాల శివ  కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా కూడా మొదటి రోజు నెగటివ్ టాక్ తెచ్చుకుంది .. కానీ చివర్లో ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుంది .. ఇక ఈ సినిమా 2016 లో రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే . అలాగే నాగార్జున , నాగచైతన్య కాంబోలో వచ్చిన బంగారు రాజు మూవీ రిలీజ్ అయిన తొలి రోజు  ప్లాప్ టాక్‌ తెచ్చుకుంది .. కానీ తర్వాత కలెక్షన్లు భారీగా రావటంతో ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది .

 అలాగే మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రష్మిక వందన్నా  హీరోయిన్ గా వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు .. ఈ సినిమా కూడా రిలీజ్ అయిన మొదటి రోజు ప్లాప్ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ తర్వాత బ్లాక్ బస్టర్ గా నిలిచింది . అదేవిధంగా అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా కూడా రిలీజ్ అయిన తొలిరోజే ప్లాప్ టాక్ అందుకుంది .. కానీ తర్వాత బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్ రాబట్టి పాన్ ఇండియా లెవెల్ లోనే బ్లాక్బస్టర్గా నిలిచింది .. ఈ సినిమానే కాకుండా సరైనోడు మూవీ కూడా మొదటిరోజు నెగిటివ్ టాక్ తెచ్చుకుని తర్వాత సూపర్ హిట్గా నిలిచింది .

మరింత సమాచారం తెలుసుకోండి: