
ఇక జాక్ సినిమాకి ప్రేక్షకుల నుంచి భారీ నెగటివ్ టాక్ రావడంతో ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా మిగిలింది .. ఇక దీంతో వైష్ణవి కి మరో ఫెయిల్యూర్ మిగిలింది .. ఇలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ రావటంతో వైష్ణవి ప్లాన్ తేడా కొట్టిందని సోషల్ మీడియాలో పలువురు ఈమెపై కామెంట్లు చేస్తున్నారు .. ఇక మరి ఈ సినిమాల రిజల్ట్ ఈమె తన తర్వాత సినిమాలను ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్లాలని కూడా కోరుతున్నారు .. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన బేబీ సినిమాతో వైష్ణవి బాగా ఫేమస్ అయ్యింది ..
అలాగే ఈ సినిమా తర్వాత ఈమెకి ఎన్నో అవకాశాలు వచ్చినా సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటూ వెళుతుంది . ఆ సెలెక్ట్‌వ్‌న్స్ ఈమె కెరియర్ కు కొంత బ్యాడ్ గా మారిందని కూడా అంటున్నారు .. చేతికి వచ్చిన అవకాశాలను వదులుకుని ఇప్పుడు వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతుందని కూడా మరికొందరు అంటున్నారు . ఈమె తర్వాత ఎలాంటి సినిమాలు నటిస్తుంది అనే దానిపై కూడా అందరిలో ఆసక్తి పెరిగింది . ఇక మరి వైష్ణవి చైతన్య రాబోయే రోజుల్లో ఎలాంటి సినిమాల తో ప్రేక్షకులు ముందుకు వస్తుందో కూడా చూడాలి ..