ప్రజెంట్ సోషల్ మీడియాలో అటు ప్రభాస్ ఇటు పవన్ కళ్యాణ్ ని ఓ రేంజ్ లో  పొగిడెస్తున్నారు జనాలు . సినిమా ఇండస్ట్రీలో వీళ్ళ కుండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఇద్దరికీ ఇద్దరు టాప్ హీరోస్. పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్ సినిమాలో నటించి స్టార్ హీరోగా మారితే ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో ఇప్పుడు పాపులారిటీ సంపాదించుకొని ఇండస్ట్రీలో  నెంబర్ వన్ హీరోగా రాజ్యమేలేస్తున్నాడు . పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా కూడా ముందుకు వెళ్తున్నాడు . కానీ రెబెల్ హీరో మాత్రం పాలిటిక్స్ వద్దనే వద్దు అంటూ చేతులు దులిపేసుకుంటున్నారు.


కానీ ఈ ఇద్దరిలో మాత్రం ఒక కామన్ క్వాలిటీ ఉంది . అదే ప్రజాసేవ ..పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా ప్రజాసేవ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటే .. ప్రభాస్ మాత్రం అసలు పొలిటికల్ పరంగా కాకుండా తన సొంత డబ్బులతో సొంత ఐడియాలజీతో ప్రజలకు చేతనైనంత సహాయం చేస్తున్నాడు . మరీ ముఖ్యంగా ప్రభాస్ తీసుకునే కొన్ని డెసిషన్ లు చాలా చాలా హైలైట్ గా ఉంటాయి . ఆయన ఏ సినిమా షూటింగ్ కోసమైనా ఏదైనా ఊరికి వెళ్తే అక్కడ ప్రజలకు ఎలాంటి వసతులు లేవో అలాంటివన్నీ కల్పించేలా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు .


దానికి ఏ పొలిటికల్ పార్టీ సపోర్ట్ అవసరం లేదు అనుకునేది ప్రభాస్ అభిప్రాయం.  గవర్నమెంట్ చేతుల్లో ఉంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు అనేది పవన్ కళ్యాణ్ ఒపీనియన్ . ఇద్దరి మార్గాలు వేరైనా ఇద్దరి గమ్యం మాత్రం ఒకటే . ఇద్దరి ఆలోచన మాత్రం ఒక్కటే. అదే ప్రజాసేవ . అందుకే ఈ ఇద్దరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ రేంజ్  లో ఉంటుంది . ప్రజెంట్ ప్రభాస్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు . కానీ అన్నిటికన్నా హైలైట్ గా నిలిచేది స్పిరిట్ సినిమానే అంటున్నారు అభిమానులు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కే ఈ మూవీ కోసం ఫ్యాన్స్  ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: