
అలాగే తన కొడుకుతో కలిసి నిన్న పవన్ హైదరాబాద్ కు తిరిగివచ్చారు . ఇక దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా పై పడింది పవన్ కి ఇంకా మూడు నుంచి ఐదు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది .. కాబట్టి పవన్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ సెట్స్ లో అడుగుపెట్టి తన భాగాన్ని పూర్తి చేస్తారని కూడా తెలుస్తుంది . ఇప్పటికే విడుదల తేదీ కూడా మే 9 కాబట్టి ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేయాలని చిత్ర బంధాన్ని ఫాన్స్ ఎంతగానో కోరుతున్నారు . కాగా దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది.
అలాగే ఈ సినిమాలో నిధి అగర్వాల్తో పాటు బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు మరియు నోరా ఫతేహి కీలక పాత్రలో నటిస్తున్నారు .. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా . మరో అగ్ర దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కూడా ఈ సినిమాలోని పలు కీలక సన్నివేశాలకు దర్శకత్వం వహించారు . ఇక మరి పాన్ ఇండియా స్థాయిలో పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వస్తున్న ఈ తొలి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి .