టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందచందాలతో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఈ చిన్నది తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మలయాళ, తమిళ సినిమాలలోను నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ చిన్నది వరుస సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాతో తన అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఈ చిన్నదానికి సోషల్ మీడియాలోనూ విపరీతంగా అభిమానులు ఉన్నారు. 


ఈ చిన్నది సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతంగా లైక్స్ వస్తాయి. అనుపమ వరుసగా ఫోటోషూట్లు చేస్తూ ఏదో ఒక ఫోటోతో తన అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. తన నటన అంద చందాలకు కోట్లాది సంఖ్యలో అభిమానులు, అభిమాన సంఘాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం అనుపమకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఈ చిన్నది తమిళ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ తో చాలా క్లోజ్ గా కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది.

ధ్రువ్ విక్రమ్, అనుపమ డేటింగ్ లో ఉన్నారంటూ అనేక రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. spotify లో వీరిద్దరి పేరిట 'బ్లూ మూన్' అనే ప్లే లిస్ట్ కనిపించడం వారు ముద్దు పెట్టుకున్నట్లుగా ప్రొఫైల్ పిక్చర్ ఉండడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 'బిసన్' అనే సినిమాలో నటిస్తున్నారు.


సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసమే అనుపమ, ధ్రువ్ విక్రమ్ ఇలా చేసి ఉంటారని సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ విషయంపైన అనుపమ పరమేశ్వరన్ ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: