
యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి తొలి పరిచయంలో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఇందులో విజయశాంతి కీలకపాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా కర్తవ్యం సినిమాలో కీ రోల్ పోషించిన పోలీస్ ఆఫీసర్ కి కొడుకు పుడితే, ఆ తర్వాత ఏం జరుగుతుంది? అనే ఆలోచన నుంచి పుట్టినదే ఈ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుందని సమాచారం. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పథకాలపై అశోకవర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాదు కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక ఇందులో సోహైల్ ఖాన్ ,యానిమల్ ఫేమ్ పృథ్వీరాజ్ తో పాటు పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ను రిలీజ్ చేయగా తల్లి కొడుకుల సెంటిమెంటుతో ఈ సినిమా ట్రైలర్ చాలా అద్భుతంగా సాగింది. అంతేకాదు ఈ సినిమా ట్రైలర్లో అదిరిపోయే డైలాగ్స్ థియేటర్లలో ఈలలు వేయిస్తాయి. మొత్తానికి అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ తోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ ను పూర్తి చేసుకున్నారు చిత్ర బృందం. U/A సర్టిఫికెట్ ను సెన్సార్ బృందం జారీ చేసింది. ఇక అంతేకాదు 149 నిమిషాల 50 సెకండ్స్ తో ఈ సినిమా నిడివిని లాక్ చేయడం జరిగింది. మొత్తానికైతే ఏప్రిల్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. అంతేకాదు ఒకవేళ ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంటే విజయశాంతికి మంచి కం బ్యాక్ అని చెప్పవచ్చు.