
కుమార్ మంగళం బిర్లా , నీరజ బిర్లా దంపతుల కుమార్తె అనన్య బిర్లా .. జాన్వి కపూర్ , అనన్య ఎన్నో సంవత్సరాలు గా మంచి స్నేహితులు అలా తమ స్నేహానికి గుర్తుగా అనన్య బిర్ల , జాన్వీ కి ఈ ఖరీదైన కారును బహుమతి గా ఇచ్చిందని అంటున్నారు . అలాగే ఈ కారు తో పాటు ఆరు అడుగుల పెద్ద పార్శీల్ ను కూడా అనన్య బిర్లా జాన్వికి పంపించిందట .. ఇక అందులో ఏముంది అనేది ఇంకా బయటకు రాలేదు .. అలాగే ఇలాంటి ఖరీదైన గిఫ్ట్లు అందుకోవటం జాన్వీ కి ఇది కొత్తెం కాదు .. గతంలో ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా ఇలాంటి ఖరీదైన డైమండ్ నెక్లెస్ , కారును కూడా గిఫ్ట్గా ఇచ్చాడు ..
ఇక దీంతో ప్రస్తుతం జాన్వీకి సంబంధించిన ఈ భారీ కార్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అలాగే ప్రస్తుతం ఈ బాలీవుడ్ హీరోయిన్ వరుస తెలుగు సినిమాలో నటిస్తూ బిజీగా కొనసాగుతుంది . ఇప్పటికే ఎన్టీఆర్ తో దేవర సినిమాలో నటించి భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది .. అలాగే ఇప్పుడు రామ్ చరణ్ తో పెద్ది సినిమాలో కూడా నటిస్తుంది . అలాగే అల్లు అర్జున్ , అట్లీ సినిమాలో కూడా జాన్వీ హీరోయిన్గా తీసుకోబోతున్నారని వార్తలు కూడా వస్తున్నాయి . ఇలా ఫుల్ ఫామ్ లో ఉన్న జాన్వీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.