చాలామంది కి ఇండస్ట్రీలో ఒక నమ్మకం ఉంటుంది . పెద్ద హీరోలతో నటిస్తే ఆ హీరోయిన్ పెద్ద హీరోయిన్గా మారిపోతుంది అని ..కానీ అది తప్పు అంటూ ఎంతో మంది ప్రూవ్ చేశారు . చాలామంది స్టార్స్ పెద్దపెద్ద హీరోలతో నటించడం వల్ల హిట్స్ అందుకోలేకపోయారు . మరీ ముఖ్యంగా ఓ హీరోయిన్ మాత్రం దారుణాతి దారుణం . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో నటించిన సరే స్టార్ హీరోయిన్గా స్టేటస్ దక్కించుకోలేకపోయింది.  ఆ హీరోయిన్ మరెవరో కాదు "అను ఇమ్మానుయేల్" . ఈ పేరుకి కొత్త పరిచయాలు అవసరం లేదు. బాగా తెలిసిన పేరే. అందంగా కూడా ఉంటుంది. చక్కగా నటిస్తుంది.


పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది . ఈ సినిమా లో ఆమె క్యారెక్టర్ మంచిదే. కానీ ఎందుకో క్లిక్ అవ్వలేకపోయింది. సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అంతేకాదు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో "నా పేరు సూర్య నా ఊరు ఇండియా" సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది . ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఈ రెండు సినిమాలు డిజాస్టర్ గా అనూ ఇమ్మాన్యూయేల్ ఖాతాలో మిగిలాయి . ఆ తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలు రాడమే మానేశాయి .



ఇప్పుడు కూడా తెలుగులో ఒక సినిమాకి కూడా కమిట్ అవ్వలేదు. అయితే ఆమెకు హీరోయిన్గా అవకాశాల కన్నా కూడా సిస్టర్ క్యారెక్టర్ లో కనిపించే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయట.  దీంతో ఇమ్మానుయేల్  పరిస్థితి దారుణతి దారుణంగా మారిపోయింది. పవర్ స్టార్ రేంజ్ స్టైలిష్ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ అను ఇమ్మాన్యూయేల్ కి ఏ మాత్రం అవకాశాలు తెచ్చిపెట్టలేకపోయింది అంటున్నారు జనాలు.  కేవలం అను ఇమ్మాన్యూయేల్ కి మాత్రమే కాదు గతంలో చాలామంది ఇలా స్టార్ హీరోలతో నటించిన అ సక్సెస్ ని అందుకోలేకపోయారు హీరోయిన్స్. కొందరి ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: