ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పా 2 లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత.   రీసెంట్ గానే తన తర్వాత సినిమా ను స్టార్‌ దర్శకుడు అట్లీ తో అధికారికంగా ప్రకటించారు .  ఇక ఈ సినిమా ను కూడా ఎవరు ఊహించిన విధంగా సైన్స్ ఫిక్షన్ మూవీ అని ఈ సినిమాకు సంబంధించిన వీడియో తో అర్థమైంది.   అలాగే ఈ సినిమాని కూడా దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో తీసుకురాబోతున్నారని కూడా ప్రచారం మొదలైంది .. ఇదే క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన వార్తల్లోకి మరో హీరోయిన్ కూడా వచ్చి చేరింది .  అల్లు అర్జున్ సినిమాకు ఖచ్చితంగా పాన్ ఇండియ‌ హీరోయిన్ కావాల్సిందే అందుకు ప్రియాంక చోప్రాను హీరోయిన్గా తీసుకోబోతున్నారట ..


అయితే అందుకు ఆమె నో చెప్పినట్టు ఓ గాసిప్స్‌ గట్టిగా వినిపిస్తుంది .  ఇప్పటికే మహేష్ , రాజమౌళి సినిమాలో ప్రియాంక నటిస్తుంది .  ఆ సినిమా వారు ఎప్పుడు షూటింగ్ పిలిస్తే అప్పుడు రావాలనేది రాజమౌళి తో చేసుకున్న ఒప్పందం .. మరోవై పు తన బెస్ట్ ఫ్రెండ్ బాలీవుడ్ స్టార్ హృతిక్ కొరటంతో క్రిష్ 4 లో కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది .. అలాగే నిన్నే హృతిక్ ప్రియంక మధ్య ఓ మీటింగ్ కూడా జరిగింది . ఇక ఇవే కాకుండా ఈమె చేతిలో రెండు హాలీవుడ్ సిరీస్ లు కూడా ఉన్నాయి .. ఈ క్రమంలో అల్లు అర్జున్ , అట్లీ సినిమాకు ప్రియంక టైం కేటాయించలేకపోతుందట ..


అలాగే ప్రస్తుతం ఇలాంటి పాన్ ఇండియా సినిమాల కు హీరోయిన్ల కొరత ఎంతగానో ఉంది .. రష్మికను తీసుకుందామంటే ఇప్పటికే పుష్ప 1న్ , పుష్ప 2 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది .. అలాగే కియ‌ర అద్వానీ ప్రెగ్నెంట్గా ఉంది .. కత్రినా కైఫ్ సినిమాలు మానేసింది .  అలాగే దీపిక కూడా ఇంకా సినిమాలు మొదలుపెట్టలేదు .. ఆలియా , జాన్వీ వరస సినిమాలతో బిజీగా ఉన్నారు .. ఇక దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ , అట్లీ సినిమాకు హీరోయిన్ల  కొరత గట్టిగానే ఉన్నట్టు అర్థమవుతుంది . ఇక మరి ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జంట‌గా ఏ హీరోయిన్ ను  అట్లీ తీసుకుంటాడో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: