
రీసెంట్ గానే మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో మాట్లాడారు . కానీ అంత ఫుల్ ఫిల్ గా నందమూరి ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయలేకపోయారు . అయితే రీసెంట్గా కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టేజ్ పైకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన స్టైల్ లో మాట్లాడి ఆకట్టుకున్నాడు . సినిమాకి పబ్లిసిటీ బాగానే ఇచ్చారు. తను కూడా ఫాన్స్ తో మీట్ అవుతాను అని చెప్పుకొచ్చాడు . ఇంతవరకు ఓకే . అయితే "మా నాన్నగారి లేని లోటును విజయశాంతి గారు తీర్చారు" అని ఆమె మాట్లాడిన మాటలు ఇప్పూదు కాంట్రవర్షియల్ గా మారాయి.
మా నాన్న లేని లోటును తీర్చారు అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పడం సంచలనంగా మారింది . అంటే జూనియర్ ఎన్టీఆర్ కి వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత అంత పెద్దదిక్కుగా ఎవరు వ్యవహరించలేదా ..? అంత అండగా ఎవరు నిలవలేదా..?అనే విధంగా మాట్లాడుకుంటున్నారు. మరి ముఖ్యంగా బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య ఎప్పటినుంచో కొన్ని సైలెంట్ గొడవలు జరుగుతున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి . మరొకసారి జూనియర్ ఎన్టీఆర్ మాటలతో ఆ గొడవలను లేవదీస్తున్నారు ఆకతాయిలు. అంటే బాలకృష్ణ డమ్మీనేనా ..? విజయశాంతినే తారక్ ఫ్యామిలీకి పెద్దదిక్కుగా నిలిచిందా..? అనే రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు. సినిమా ఇష్యూ కాస్త ఫ్యామిలీ వార్ గా మారిపోయింది..!