మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో ‘విశ్వంభర’ అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..ఈ మూవీని యూవీ క్రియేషన్స్‌ సంస్థ అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తోంది.ఈ సినిమా కోసం నిర్మాణ సంస్థ దాదాపు రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేశారని సమాచారం. అయితే గతంలో ఈ చిత్రం నుండి విడుదలయిన టీజర్‌ ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. గ్రాఫిక్స్ సరిగ్గా లేకపోవడంతో భారీగా ట్రోల్స్‌ వచ్చాయి. దీంతో ఈ సంక్రాంతికి రావాల్సిన సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. అయి తే, తాజాగా విశ్వంభర గ్రాఫిక్స్‌ గురించి వశిష్ఠ తండ్రి సత్యనారాయణ రెడ్డి మల్లిడి కీలక వ్యాఖ్యలు చేశారు.దర్శకుడు వశిష్ఠ అసలు పేరు మల్లిడి వెంకట నారాయణ రెడ్డి. ఆయన తండ్రి నిర్మాతగా టాలీవుడ్‌లో ఢీ, బన్ని, భగీరథ వంటి చిత్రాలు నిర్మించారు. అయితే, తాజాగా వశిష్ఠ తండ్రి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విశ్వంభర గ్రాఫిక్స్‌ వర్క్‌ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు..

 'విశ్వంభర సినిమా షూటింగ్‌ కొంత పూర్తి అయిన తర్వాత గ్రాఫిక్స్‌ కోసం ఫుటేజ్‌ ఇవ్వడం జరిగింది... వీఎఫ్‌ఎక్స్‌ టీమ్‌ వారు మూడు నెలల్లోనే పూర్తి చేసి ఇస్తాం అని చెప్పారు అన్నారు. కానీ మెగాస్టార్ సినిమా కావడంతో ఆరు నెలలు టైమ్‌ తీసుకోమని మేకర్స్‌ సూచించారు.గ్రాఫిక్స్ పూర్తి అవుతుందనే నమ్మకంతో 2025 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ, తొమ్మిది నెలలు గడిచినా వారు గ్రాఫిక్స్‌ పని మాత్రం పూర్తి చేయలేకపోయారు.విడుదల తేదీ దగ్గరకు రావడంతో మేకర్స్ టీజర్‌ను వదిలారు. ఆర్టిఫిషయల్‌ టెక్నాలజీ ఉపయోగించుకుని వారు టీజర్‌ను క్రియేట్‌ చేశారు. అది గ్రాఫిక్స్‌ వర్క్‌ అయితే కాదు... ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో గ్రాఫిక్స్‌ టీమ్‌లో బెనుకు మొదలైంది. తర్వాత VFX నాణ్యతలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. త్వరలో విశ్వంభర నుంచి మరో టీజర్‌తో పాటు ట్రైలర్‌ రావచ్చు. అందులో అసలైన వీఎఫ్‌ఎక్స్‌ పనితీరు ఎలా ఉందో మీరందరూ చూస్తారంటూ చెప్పుకొచ్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి: