
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో బి గోపాల్ ఒకరు. గోపాల్ , బాలకృష్ణ హీరోగా మొదటగా లారీ డ్రైవర్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరి కాంబోలో రౌడీ ఇన్స్పెక్టర్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత వీరి కాంబోలో సమరసింహారెడ్డి అనే మూవీ వచ్చింది. ఈ మూవీ ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన నరసింహ నాయుడు సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత వీరి కాంబోలో పల్నాటి బ్రహ్మనాయుడు అనే సినిమా వచ్చింది. ఈ మూవీ మాత్రం బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక బి గోపాల్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మొదటగా అల్లరి రాముడు మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత వీరి కాంబోలో నరసింహుడు అనే సినిమా వచ్చింది. ఈ మూవీ కూడా ప్లాప్ అయ్యింది. ఇలా బాలకృష్ణకు నాలుగు అద్భుతమైన విజయాలు అందించిన ఈ దర్శకుడు తారక్ కి మాత్రం విజయాన్ని అందించలేకపోయాడు.