టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక ఈమేజ్ ను ఏర్పరుచుకున్న నటులలో ప్రియదర్శి ఒకరు. ఈయన ఇప్పటి వరకు చాలా సినిమాలలో నటించి నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే ఈయన ఈ మధ్య కాలంలో చాలా సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. ఈయన హీరో గా నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో హీరోగా కూడా ఈయనకు మంచి గుర్తింపు ఏర్పడింది. కొంత కాలం క్రితం ఈయన కోర్టు అనే సినిమాలో హీరో గా నటించాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ప్రియదర్శి "సారంగపాణి జాతకం" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... వెన్నెల కిషోర్ , వైవా హర్షమూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ ని ఏప్రిల్ 18 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. తాజాగా ఈ మూవీ ని ఏప్రిల్ 18 వ తేదీన కాకుండా ఏప్రిల్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా యొక్క యూ ఎస్ ఏ హక్కులను "వి" సినిమా సంస్థ వారు దక్కించుకున్నారు.

అందులో భాగంగా ఈ మూవీ ప్రీమియర్ లను  యూ ఎస్ ఏ లో ఏప్రిల్ 24వ తేదీన ప్రీమియర్స్ ప్రదర్శించనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుందో , ఏ రేంజ్ విజయాన్ని ఉంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: