టాలీవుడ్ ఇండస్ట్రీ లో నిర్మాతగా , దర్శకుడిగా అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందు కు సాగిస్తున్న వారిలో ఒకరు అయినటువంటి దిల్ రాజు కొన్ని సంవత్సరాల క్రితం సునీల్ హీరోగా వాసు వర్మ దర్శకత్వంలో కృష్ణాష్టమి అనే మూవీ ని రూపొందిం చిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది . దిల్ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా కృష్ణాష్టమి మూవీ ఫ్లాప్ కావడానికి గల కారణాలను వివరించాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... వాసు వర్మ దర్శకత్వం లో ఓ సినిమా చేయాలి అనుకున్నాం. అందులో భాగంగా కోనా వెంకట్ దగ్గర ఉన్న ఓ కథ బాగా నచ్చడంతో దానిని తీసుకున్నాం. కోనా వెంకట్ మాకు అద్భుతమైన కామెడీ ఎంటర్టైనర్ కథను అందించాడు. ఇక మేము సునీల్ ను హీరోగా అనుకున్నాం. కథ ఓకే అయ్యాక సినిమాను మొదలు పెట్టే మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది. దానితో మేము ఆ కథలో అనేక మార్పులు , చేర్పులు చేశాము. దానితో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ స్టోరీ లో అనేక మార్పులు , చేర్పులు జరిగాయి. ఇక సినిమా మొదలు పెట్టాం.

మేము మార్పులు , చేర్పులు చేసిన కథతోనే మూవీ ని రూపొందించాం. సినిమా విడుదల అయ్యాక ఆ మూవీ కామెడీ ఎంటర్టైనర్ మూవీ కాకుండా పోయింది. దానితో ఆ సినిమా ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. మేము ఆ మూవీ కథలో మార్పులు , చేర్పులు చేసి ఉండకపోయి ఉండుంటే ఆ సినిమా మంచి విజయం సాధించేది అని దిల్ రాజు తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: