
కొన్ని సంవత్సరాల క్రితం రవితేజ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భద్ర మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని మొదట బోయపాటి శ్రీను , తారక్ తో చేయాలి అనుకున్నాడు. అందులో భాగంగా ఆయనకు కథను కూడా వినిపించగా ఆయన ఆ స్టోరీని రిజెక్ట్ చేశాడట. దానితో బోయపాటి అదే కథతో రవితేజతో భద్ర అనే టైటిల్ తో సినిమా చేసినట్లు తెలుస్తోంది. ఆ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. రవితేజ హీరోగా రూపొందిన కిక్ మూవీ అద్భుతమైన విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. సురేందర్ రెడ్డి ఈ మూవీ ని మొదట తారక్ తో చేయాలి అని అనుకున్నాడట. అందులో భాగంగా ఆయనకు కథను కూడా వినిపించాడట. కానీ తారక్ మాత్రం కొన్ని కారణాల వల్ల ఆ సినిమా కథను రిజెక్ట్ చేశాడట. దానితో సురేందర్ రెడ్డి అదే కథను రవితేజతో రూపొందించగా ... ఆ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలా తారక్ రిజెక్ట్ చేసిన రెండు స్టోరీలతో రవితేజకు రెండు విజయాలు దక్కినట్లు తెలుస్తుంది.