
నాగార్జున హీరోగా శ్రీదేవి హీరోయిన్గా రాఘవేంద్రరావు దర్శకత్వంలో కొన్ని సంవత్సరాలు క్రితం ఆఖరి పోరాటం అనే సినిమా వచ్చి మంచి విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను మొదట రాఘవేందర్రావు , చిరంజీవి హీరోగా రూపొందించాలి అని అనుకున్నాడట. అందులో భాగంగా చిరంజీవిని కలిసి కథను కూడా వివరించాడట. చిరుకి కూడా కథ బాగా నచ్చడంతో ఆ కథతో సినిమా చేద్దాం అని చెప్పాడట. ఇక చిరంజీవికి కథ చెప్పిన తర్వాత సినిమా స్టార్ట్ కావడానికి చాలా సమయం పట్టిందట. ఇక అంత ఓకే అనుకొని సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్న సమయానికి చిరంజీవి ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల రాఘవేంద్రరావు గారితో నేను ఈ సినిమా చేయలేను అని చిరంజీవి చెప్పాడట. దానితో రాఘవేంద్రరావు , చిరంజీవికి చెప్పిన సినిమా కథతో నాగార్జునతో ఆఖరి పోరాటం అనే టైటిల్ తో మూవీని రూపొందించడట. ఆ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుందట. అలా చిరంజీవి రిజెక్ట్ చేసిన మూవీ తో నాగార్జున కు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం దక్కినట్లు తెలుస్తోంది.