
సినిమా రంగం లో హీరో లు.. హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకోవడం.. ప్రేమలో పడడం .. ప్రేమలో పడి డేటింగులు చేసుకోవడం.. పెళ్లి చేసుకుని కాపురం చేశాక విడిపోవడం కామన్ గా జరుగుతూ వస్తుంది. కొందరు హీరో .. హీరోయిన్లు అయితే ప్రేమలో పడి పెళ్లి చేసుకుని .. పిల్లలు పుట్టి చాలా యేళ్ల పాటు కాపురం చేశాక మనస్పర్థల నేపథ్యంలో విడాకులు తీసుకుంటూ ఉంటారు. ఇలా ఎన్ని జరిగినా కూడా సినిమా ఇండస్ట్రీ లో హీరో .. హీరోయిన్ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటే ఆ న్యూస్ కు ఉండే క్రేజే వేరు. తాజాగా ఇలాంటి న్యూస్ ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తోంది.
తమిళ స్టార్ చియాన్ విక్రమ్ కుమారుడు ‘ ధృవ్ ’, ‘ అర్జున్ రెడ్డి ’ రీమేక్ తో తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అక్కడ ధృవ్ భారీ క్రేజ్ తెచ్చుకుని ... ఫుల్ ఫాలోయింగ్ సంపాదించాడు. క్యారెక్టర్ కోసం బాడీని ఎలాగైనా మార్చుకోవడం తో ధృవ్ కు అక్కడ యూత్‌లో పిచ్చ క్రేజ్ ఉంది. ఫస్ట్ సినిమా తోనే డిఫరెంట్ వేరియేషన్లు చూపించడం తో యాంగ్రీ యంగ్ మ్యాన్ అనిపించుకున్నాడు. ఇదిలా ఉంటే మన టాలీవుడ్ లో అందరికి బాగా సుపరిచితం అయిన క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో పాటు ధృవ్ ప్రేమ వ్యవహారం ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.
ధృవ్ తో ప్రేమలో మునిగి తేలుతున్న అనుపమ అతడితో పెళ్లికి రెడీ అవుతోందనే వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలు నిజమా..? లేదా ? అన్న దానిపై చర్చలు నడుస్తున్నాయి. అనుపమ-ధృవ్ ల నడుమ మంచి సాన్నిహిత్యం వుందని చాలా రోజుల నుంచి టాక్ ఉంది. ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూట్ లో ఇద్దరు దగ్గర అయ్యారట. మరి వీరు నిజంగా పెళ్లి చేసుకుంటే క్రేజీ జంట అవుతారు అనడంలో సందేహం లేదు.