
ఇక విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ పైన ఇప్పటివరకు ఏ విధమైనటువంటి అప్డేట్ మాత్రం తెలుపలేదు చిత్ర బృందం. దర్శక నిర్మాతల నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో సోషల్ మీడియాలో విశ్వంభర సినిమా గురించి ఒక చర్చ అయితే జరుగుతోంది. చిరంజీవికి ఇష్టమైన హనుమంతుడు జయంతి సందర్భంగా ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయగా.. ఇందులో చిరంజీవి లుక్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కీరవాణి అందించిన మ్యూజిక్ తగ్గట్టుగానే చిరంజీవి డాన్స్ వేయడంతో అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు.
ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న విశ్వంభర ఒక్కసారిగా మెగా సెంటిమెంట్ తో ప్రమోషన్స్ ని మొదలుపెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. గ్రాఫిక్స్ విజువల్స్ తో ఈ సినిమా టీజర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయం పైన ఒక న్యూస్ అయితే వినిపిస్తోంది అదేమిటంటే ఇంద్రా సినిమా రిలీజ్ అయిన జులై 24 వ తేదీని విశ్వంభర సినిమాలు కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర బృందం వార్తలు వినిపిస్తున్నాయి. మరి విశ్వంభర సినిమా ఒకవేళ ఈ డేట్ కి రిలీజ్ చేస్తే చిరంజీవి లక్ మారుతుందేమో చూడాలి.