
ఈ ముద్దుగుమ్మ హ్యాపీ డేస్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, ఊసరవెల్లి, బాహుబలి, రచ్చ, తడాఖా, ఊపిరి, ఎఫ్ 1 అండ్ 2, సైరా నరసింహ రెడ్డి, బెంగాల్ టైగర్ సినిమాలలో నటించింది. ఈ భామ ప్రస్తుతం ఓదెల 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఒక నేచురల్ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాలో తమన్నా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహా ప్రధాన పాత్రలు పోషించారు. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఎలా కాపాడుతాడనేది ఈ మూవీలో చూపిస్తారు. ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్ లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ.. 'శివశక్తి పాత్ర చేయడం అనేది చాలా పెద్ద బాధ్యత. మా సినిమాలో మేము శివశక్తి గురించి మంచిగా చూపించాము. మేము డాక్టర్ గా, పోలీస్ ఆఫీసర్ గా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాము. కానీ శివశక్తి పాత్ర అనేది ఇంతవరకు ఏ సినిమాలో చూపించలేదు. ఆ పాత్ర చేయాలంటే చాలా భక్తి ఉండాలి. నేను ఆ పాత్రలో నటిస్తున్నప్పుడు ఒక మంచి అనుభూతి కలిగింది' అని తమన్నా చెప్పుకొచ్చింది.