
ఇకపోతే గతంలో మంచు విష్ణు, మనోజ్ కొట్టుకున్న విషయం తెలిసిందే. తన పెళ్లి తర్వాత విష్ణు తనపై దాడి చేస్తాడని మంచు మనోజ్ రిలీజ్ చేసిన వీడియో సంచలనంగా మారింది. అయితే ఆ వీడియో రియాలిటీ షోలో భాగంగా తీసింది అని మంచు విష్ణు కవర్ చేశారు. ఇటీవల మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య జరిగిన గొడవలు అంతా ఇంత కాదు. అయితే వారి గోడవలను కవర్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ గోడవల కారణంగా టీవీ 9 ఛానల్ రిపోర్టర్ రంజిత్ కుమార్ పై మోహన్ బాబు దాడి చేశారు.ఆ తర్వాత తప్పు తనదేనని మోహన్ బాబు ఒప్పుకున్నారు.
అయితే ఇటీవల మంచు ఇంట మళ్లీ రచ్చ మొదలైంది. రీసెంట్ గా మంచు మనోజ్ తన కారు పోయిందని.. దానికి కారణం మంచు విష్ణు అని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా నటి మంచు లక్ష్మి హైదరాబాద్ లో టీచ్ ఫర్ ఛేంజ్ సేవా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి వచ్చాడు. ఈవెంట్ కి సోదరుడు వచ్చి సర్ ప్రైజ్ చేయడంతో లక్ష్మి ఎమోషనల్ అయ్యింది. స్టేజ్ పైననే కన్నీరు పెట్టుకుని ప్రేమగా మంచు మనోజ్ ని హత్తుకుంది. దీంతో మౌనిక ఆమెని ఓదార్చే ప్రయత్నం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.