హీరోల రెమ్యూనరేషన్లు 100 కోట్లు 150 కోట్లు 200 కోట్లు 300 కోట్లు ఇలా ఉంటాయి. కానీ సినిమా మొత్తం కనిపించే హీరోయిన్ల రెమ్యూనరేషన్ మాత్రం కనీసం 10 కోట్లు కూడా ఉండదు. బాలీవుడ్ హీరోయిన్ అయితే 10 నుండి 15, 20 కోట్లు తీసుకుంటారు.కానీ సౌత్  ఇండస్ట్రీలో సినిమా చేసే హీరోయిన్లకు అంత రెమ్యూనరేషన్లు ఉండవు.సౌత్ హీరోయిన్ రెమ్యూనరేషన్ 10 కోట్లు మించి ఉండవు. కానీ సినిమా మొత్తం కనిపించే హీరోయిన్లు 10 కోట్ల రెమ్యూనరేషన్ కూడా తీసుకోరు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం యాడ్స్ చేస్తూ రెండు మూడు సెకండ్లకి 5 సెకండ్లకి కనిపించే యాడ్ కి ఒక్క నిమిషం చేసే యాడ్ కి ఐదు కోట్లు, మూడు కోట్లు ఇలా రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందరికీ షాక్ ఇస్తా ఉంటారు. 

అయితే అలాంటిది ఓ హీరోయిన్ అయిదు నిమిషాలు కనిపించే పాట కోసం ఏకంగా ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట. అయితే ఈ హీరోయిన్ ఎవరంటే అందరూ సమంత అని అనుకుంటారు. ఎందుకంటే పుష్ప సినిమాలో ఉ అంటావా మామా అనే పాట కోసం సమంత 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంది. దాంతో అందరూ సమంతనే  అనుకుంటారు. కానీ సమంత కాదు మరో హీరోయిన్ కూడా ఐదు నిమిషాలు కనిపించే పాట కోసం ఏకంగా ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు తమన్నా భాటియా..

 అవును మీరు వినేది నిజమే.తమన్నా తాజాగా నషా అనే ఐటెం సాంగ్ లో చేసింది. తమన్నా అజయ్ దేవగన్,రితేష్ దేశముఖ్ కలిసిన నటించిన రైడ్-2 మూవీలో నషా అనే ఐటమ్ సాంగ్ చేసింది. అయితే ఈ ఐటెం సాంగ్ లో ఐదు నిమిషాలు కనిపించడం కోసం ఏకంగా ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు బీటౌన్ లో టాక్ వినిపిస్తోంది.ఇక ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు సినిమా మొత్తం కనిపించినా ఐదు కోట్లు రావడం లేదు. కానీ ఐదు నిమిషాల పాటకే ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడంతో తమన్నా క్రేజ్ మామూలుగా లేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: