
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వార్2 సినిమా కోసం ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఆగష్టు నెల 14వ తేదీన ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు పోటీగా కూలీ అనే మరో సినిమా థియేటర్లలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. వార్2 వర్సెస్ కూలీ పోటీలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద పైచేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది.
అయితే వార్2 సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. అరవింద సమేత సినిమాలో తారక్ సిక్స్ ప్యాక్ లుక్ ను మరిపించేలా వార్2 సినిమాలో తారక్ సిక్స్ ప్యాక్ లుక్ ఉంటుందని తెలుస్తోంది. వార్2 సినిమాలో తారక్ కు జోడీ ఎవరనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది. వార్2 సినిమాలో తారక్ పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తోంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఇప్పటికే వరుసగా ఏడు విజయాలు దక్కాయి. తర్వాత సినిమాలు సైతం తారక్ కోరుకున్న భారీ విజయాలను అయితే అందిస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వార్2 ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ లో తారక్ సిక్స్ ప్యాక్ లుక్ తో ఎంట్రీ అదిరిపోతుందని భోగట్టా. వార్2 సినిమాలో తారక్ పాత్రకు ప్రాధాన్యత ఒకింత ఎక్కువగానే ఉంటుందని సమాచారం అందుతోంది.
విశ్వంభర, వార్2 సినిమాల మధ్య రెండు వారాల గ్యాప్ ఉండబోతుంది. ఈ సినిమాలో హృతిక్, తారక్ మధ్య ఒక సాంగ్ ఉంటుందని ఆ సాంగ్ నాటునాటు సాంగ్ ను మించేలా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వార్2 సినిమా భాషతో సంబంధం లేకుండా రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది.