
ఇక అక్కడ తలనిలాలు సమర్పించారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈరోజు ఉదయం సుప్రభాత సమయంలో కూడా ఈమె శ్రీవారిని దర్శించుకుంటున్నట్లు తెలుస్తోంది.అందుకు సంబంధించిన అధికారులు కూడా పలు రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అనంతరం అన్నదానం కోసం విరాళం కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అక్కడే అన్నదానం స్వీకరించి మరి ఆమెతో పాటు పిల్లలు కూడా తిరుపతికి చేరుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
సింగపూర్లో కిచెన్ స్కూల్లో అగ్నిప్రమాదం జరగడంతో దీంతో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కూడా ఈ అగ్ని ప్రమాదం లో చిక్కుకోవడం జరిగింది. దీంతో హుటాహుటిగా మెగా కుటుంబ సభ్యులు కూడా సింగపూర్ కి బయలుదేరి మరి అక్కడ మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి అన్ని విధాల వైద్యులను అడిగి మరి తెలుసుకున్నారట. అనంతరం అక్కడ చిన్నపిల్లలను సైతం కాపాడినటువంటి టీముని కూడా సత్కరించడం జరిగింది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్పు కి మాత్రం కాళ్లు చేతులకు కూడా గాయాలు అయ్యాయి అయితే ప్రస్తుతం అయితే కోలుకొని ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తన కొడుకు కోసం తలనీలాలు ఇచ్చింది అన్నాలేజినోవా.