ఏంటి అనుపమ ప్రేమ పేరుతో ఆ హీరోని మోసం చేసిందా.. ఇంతకీ అనుపమ చేతిలో మోసపోయిన ఆ హీరో ఎవరు? ఎందుకు అభిమానులు అనుపమ పరమేశ్వరన్ ని తిట్టుకుంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. అనుపమ పరమేశ్వరన్ తాజాగా వార్తల్లో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. ఎందుకంటే యంగ్ హీరోతో లిప్ లాక్ ఫోటో వైరల్ అవ్వడంతో అనుపమ పరమేశ్వరన్ డేటింగ్ వార్తలు ఒకసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక విషయంలోకి వెళ్తే..అనుపమ పరమేశ్వరన్ తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కొడుకు దృవ్ విక్రమ్ తో డేటింగ్ లో ఉంది అని, వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, వీరిద్దరి లిప్ లాక్ ఫోటో కూడా ఒకటి వైరల్ అయింది. 

అయితే వీరిద్దరి లిప్ లాక్ ఫోటో ఎప్పుడైతే సోషల్ మీడియాలో బయటపడిందో అప్పటినుండి అనుపమ పరమేశ్వరన్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.అంతే కాదు ధ్రువ్ విక్రమ్ అనుపమ పరమేశ్వరన్ కాంబోలో ప్రస్తుతం కొత్త సినిమా రాబోతుంది. మరి కొత్త సినిమా కోసం వార్తల్లో నిలిచారా.. లేక నిజంగానే డేటింగ్ లో ఉన్నారా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఈ విషయం పక్కన పెడితే ఎప్పుడైతే అనుపమ ధ్రువ్ విక్రమ్ తో కలిసి లిప్ లాక్ పెట్టిన ఫోటో వైరల్ అయిందో అప్పటినుండి టాలీవుడ్ హీరో రామ్ పోతినేని అభిమానులు ఆమెపై ఫైర్ అవుతున్నారు.ఎందుకంటే చాలా రోజుల నుండి రామ్ పోతినేని అనుపమ ఇద్దరు ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారు అనే రూమర్లు వినిపిస్తున్నాయి.

 అంతేకాదు వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని కూడా రామ్ పోతినేని అభిమానులు ఎన్నో రూమర్స్ క్రియేట్ చేశారు. ఇలాంటివేళ రామ్ పోతినేనిని పక్కన పెట్టి ధృవ్ విక్రమ్ తో అనుపమ పరమేశ్వరన్ డేటింగ్ చేస్తుంది అనే వార్తలు రావడంతో చాలామంది రామ్ అభిమానులు అనుపమ పై ఫైర్ అవుతున్నారు. చాలా రోజుల నుండి రామ్ పోతినేని తో తిరిగి ఆయన్ని ప్రేమిస్తున్నట్టు నటించి ఇప్పుడేమో సడన్ గా మరో హీరోతో ప్రేమలో పడ్డావా అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే గతంలో రామ్ పోతినేనితో డేటింగ్ వార్తలు వినిపించిన సమయంలో అటు రామ్ పోతినేనితో పాటు ఇటు అనుపమ పరమేశ్వరన్ కూడా ఖండించింది. అందులో ఎలాంటి నిజం లేదని చెప్పింది. కానీ రామ్ పోతినేని అభిమానులే అలాంటిదేమీ లేదు ఇద్దరి మధ్య నిజంగానే ప్రేమ ఉంది అంటూ పుకార్లు క్రియేట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: