
అందుకు కారణం ఈ హీరోయిన్ మరింత అందంగా మారడం కోసం తన ముఖానికి సర్జరీ చేయించుకుందని దీనివల్ల అందవికారంగా కూడా మారిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన మౌని రాయ్ కీ సంబంధించి పలు రకాల ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. తనపై వస్తున్న ట్రోల్స్ కి తాజాగా స్పందించిన మౌని రాయ్.. పలు విషయాలను తెలియజేసింది. తనపై చేస్తున్న కామెంట్స్ చేసే వాళ్ళు నాకు కనిపించరని కాబట్టి వాళ్ళ మాటలకు తాను బాధపడాల్సిన పని లేదంటూ తెలియజేసింది.
అలాంటి వ్యాఖ్యలు చేసే వారిని అసలు తాను పట్టించుకోనని ఎందుకంటే వాళ్లకు ట్రోల్ చేయడమే ఒక ఆనందం. అలాంటి వారి ఆనందం కోసం తాను అడ్డుపడనని.. ఎవరికి నచ్చినట్టుగా వారు జీవించనివ్వండి అందుకే తాను అలాంటి వారిని ఏమీ అనలేనని కూడా తెలియజేసింది. త్వరలోనే మౌని రాయ్ దిబూత్నీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. ఈ సినిమాలో సందర్భంగా ఒక ఈవెంట్లో పాల్గొన్నప్పటి నుంచి ఈమె గురించి ఎక్కువగా ట్రోల్స్ మొదలయ్యాయి అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తనని ట్రోల్ చేసే వారి పైన ఇలా దిమ్మతిరిగే సమాధానాన్ని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.