సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కుతుంది.. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. బిగ్గెస్ట్ అడ్వెంచర్రస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ రాజమౌళి శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మూడో షెడ్యూల్ షూటింగ్ కూడా మొదలు కానుంది.. ఈ సినిమాలో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నటిస్తుంది.. అలాగే మలయాళం స్టార్ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు..త్వరలోనే ఓ బిగ్ ప్రెస్ మీట్ నిర్వహించి ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలియ జేయనున్నారు.. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.

స్టార్ డైరెక్టర్ దేవ కట్టా మహేష్ మూవీ కోసం డైలాగ్ రైటర్ గా వర్క్ చేసినట్లు గా న్యూస్ వైరల్ అవుతుంది.. అయితే దేవ కట్టా దర్శకుడిగా చేసింది తక్కువ సినిమాలే అయినా  ఇటు ప్రేక్షకుల్లో, అటు ఇండస్ట్రీలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. 'వెన్నెల' లాంటి ఎంటర్టైనర్‌ మూవీతో దర్శకుడిగా పరిచయం అయన దేవా..ప్రస్థానం'తో గొప్ప దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ప్రస్థానం సినిమా దేవ కట్టా కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది..ఆ సినిమాలో ఎంతో లోతైన అర్థంతో సాగే సంభాషణలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఇప్పటికీ 'ప్రస్థానం' డైలాగ్స్ ఎంతో పాపులర్.. అయితే దేవ కట్టా కెరీర్ లో ఫ్లాప్ సినిమాలైన 'ఆటోనగర్ సూర్య', 'రిపబ్లిక్' సినిమా లోనూ డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. దేవాలోని ఈ ప్రతిభే దర్శక ధీరుడు రాజమౌళిని సైతం ఎంతగానో ఆకట్టుకుంది.

అందుకే 'బాహుబలి' లాంటి భారీ మూవీ కోసం దేవ కట్టా సాయం తీసుకున్నాడు.ఆ సినిమా లో యుద్ధ భూమిలో నైరాశ్యంలో ఉన్న సైనికుల్లో ధైర్యాన్ని నింపుతూ ప్రభాస్ చెప్పే 'మరణం' డైలాగ్స్ రాసింది దేవానే.. అలాగే 'బాహుబలి' వెబ్ సిరీస్ మీద కూడా దేవా.. జక్కన్నతో కలిసి పని చేశాడు. తాజా సమాచారం ప్రకారం. రాజమౌళి, మహేష్  కాంబినేషన్ మూవీ కి దేవా పూర్తి స్థాయిలో డైలాగ్స్ రాస్తున్నాడట..
సినిమా కోసం మిగతా రైటర్స్ కూడా పని చేస్తుండగా మెజారిటీ డైలాగ్స్ దేవా రాసినవే ఉండనున్నట్లు సమాచారం.. అలాగే రాజమౌళి కి బాగా నచ్చిన డైలాగ్స్ ఇతర భాషల్లో కి డబ్ కూడా చేయనున్నట్లు సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: