
విజయ్ వర్మ తమన్నాకు ప్రేమించుకొని తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అయితే లేదని తమన్నా వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. నా దృష్టిలో చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదని ఆమె పేర్కొన్నారు. కంటెంట్ బాగుంటే చిన్న సినిమానే పెద్ద సినిమా అవుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
కంటెంట్ నచ్చని పక్షంలో ఆ సినిమా చిన్న సినిమా అవుతుందని తమన్నా చెప్పుకొచ్చారు. హ్యాపీడేస్ సినిమాలో మొత్తం 8 పాత్రల్లో తన పాత్ర కూడా ఒకటని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. డ్యాన్స్ అంటే ఇష్టం కావడం వల్లే తాను స్త్రీ2 సినిమాలో నటించానని తమన్నా పేర్కొన్నారు. ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ అవుతుందని నేను అస్సలు ఊహించలేదని తమన్నా అభిప్రాయపడ్డారు.
ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో అస్సలు ఊహించలేమని తమన్నా పేర్కొన్నారు. తమన్నా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. హీరోయిన్ తమన్నా కెరీర్ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. హీరోయిన్ తమన్నా లుక్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు. తమన్నా రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు సృష్టిస్తారేమో చూడాలి. తమన్నా త్వరలో పెళ్లికి సంబంధించిన శుభవార్త చెప్పాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రాబోయే రోజుల్లో తమన్నా రేంజ్ మరింత పెరుగుతుందేమో చూడాలి. ఓదెల2 హిట్టైతే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది.