టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చిన హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈ హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన సినిమాల ద్వారా యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఎన్నో సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న కిరణ్ అబ్బవరం తాజాగా మరో సినిమాతో అభిమానుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. కాగా, ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. 

సుజిత్ సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత సంవత్సరం అక్టోబర్ 31న రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దాదాపు రూ. 53 కోట్ల కలెక్షన్లు కాబట్టి ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కాగా, ఈ సినిమా ఇదివరకే ఓటీటీలోను రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉండగా... కిరణ్ అబ్బవరం రీసెంట్ గానే నటి రహస్య గోరక్ ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించారు. ఆ సమయంలోనే వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.


అతి తక్కువ సమయంలోనే ఆ స్నేహం ప్రేమగా మారడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరుపుకున్నారు. వివాహం తర్వాత కిరణ్ అబ్బవరం 'క' సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను రహస్య దగ్గర ఉండి మరీ చూసుకున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే అత్యంత ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలవడం విశేషం.

ఇక ఈ హీరో త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. ఈ విషయం తెలిసి తన అభిమానులు ఎంతగానో సంతోషించారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం ఓ వైపు సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ తన ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: