
స్టార్ హీరో ప్రభాస్ గతంలో పలు సినిమాల్లో డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు. ది రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తుండటం గమనార్హం. ప్రభాస్ ది రాజాసాబ్ ఈ ఏడాదే థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రభాస్ ఈ సినిమాలో దెయ్యం పాత్రలో కనిపిస్తారని ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని సమాచారం అందుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తుండటం గమనార్హం. అట్లీ సినిమాలో అల్లు అర్జున్ రోల్ కొత్తగా ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అల్లు అర్జున్ తర్వాత సినిమాలతో ఏ స్థాయిలో సంచలనాలను సృష్టిస్తారో చూడాల్సి ఉంది. అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
కింగ్ డమ్ సినిమాలో విజయ్ దేవరకొండ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలు ఈ హీరొల కెరీర్ కు ఎంత ప్లస్ అవుతాయో చూడాల్సి ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు తమ రేంజ్ ను మరింత పెంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. టాలీవుడ్ హీరోలు ఇతర భాషల్లో సైతం సత్తా చాటుతున్నారు.