సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంత మంది హీరోలు వారి వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినీ ఇండస్ట్రీ లోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారు ఎందరో ఉన్నారు. అందులో కొంతమంది హీరోలు సక్సెస్ కాగా....మరి కొంత మంది సక్సెస్ అందుకోలేక పోతున్నారు. అలాంటి వారిలో అక్కినేని అఖిల్ ఒకరు.  అక్కినేని  నాగార్జున వారసుడిగా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన అఖిల్ సినిమాలలో పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు.


 
అక్కినేని అఖిల్ పెద్ద కుటుంబం సినీ బ్యా గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తన సినిమాలతో అభిమానులను పెద్దగా ఆకట్టు కోలేకపోతున్నారు. ఈ హీరో గత కొద్ది రోజుల క్రితమే ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమా అనంతరం అక్కినేని  అఖిల్ 'లెనిన్' సినిమా తో అభిమానుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బురి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని  అఖిల్ సరసన హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తోంది. 


ఇటీవలే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ కు అభిమానుల లో మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ సినిమా కథ విషయం తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. లెనిన్ సినిమా కథ రాయల సీమ బ్యాక్ డ్రాప్ లో చిత్తూరు పరిసరాల్లో ఈ సినిమా కథ సాగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. లెనిన్ సినిమాలో అక్కినేని  అఖిల్ పాత్ర ఎవ్వరు ఊహించని విధంగా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా ఈ సినిమా లో అక్కినేని  అఖిల్, శ్రీ లీల జంట చాలా అద్భుతంగా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా తో అయిన అక్కినేని అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతా లో వేసుకోవాలని అక్కినేని  అఖిల్ అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: