కొన్ని సంవత్సరాల క్రితం రవితేజ "నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి ఎస్ గోపాల రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ 2004 వ సంవత్సరం విడుదల అయింది. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో బాక్సా ఫీస్ దగ్గర భారీ స్థాయి విజయాన్ని అందుకోలేదు. మామూలు స్థాయి కలెక్షన్లను వసూలు చేసి యావరేజ్ విజయాన్ని అందుకుంది. అలా బాక్సా ఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు ఆ తర్వాత బుల్లి తెర ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

ఇక ఇప్పటికి కూడా ఈ సినిమా బుల్లి తెరపై ప్రసారం అయినట్లయితే మంచి టి ఆర్ పి రేటింగ్ ను తెచ్చుకుంటుంది. ఇకపోతే ఇలా 2004 లో విడుదల అయ్యి మంచి ప్రేక్షకదరణ పొందిన ఈ సినిమాను మళ్ళీ థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ ని ఏప్రిల్ 18 వ తేదీన థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. 

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ మధ్య కాలంలో అనేక తెలుగు సినిమాలు రీ రిలీజ్ అయ్యి మంచి వసూళ్లను రాబట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మరి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ మూవీ రీ రిలీస్ లో భాగంగా ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: