రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటివరకు ప్రభాస్ ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ చాలా సంవత్సరాల క్రితం వర్షం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. త్రిషమూవీ లో హీరోయిన్గా నటించగా ... శోభన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఎం ఎస్ రాజు ఈ మూవీ ని నిర్మించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మూవీ ని 2004 వ సంవత్సరం జనవరి 14 వ తేదీన విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే 2004 వ సంవత్సరం విడుదల అయ్యి సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను మళ్ళీ థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. వర్షం సినిమాను మే 23 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలకు సంబంధించిన ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. అలాగే వాటిలో చాలా సినిమాలకు మంచి కలెక్షన్లు కూడా దక్కాయి. మరి వర్షం సినిమా రీ రిలీజ్ లో భాగంగా ఎలాంటి రెస్పాన్స్ ను జనాల నుండి తెచ్చుకుంటుందో ఆ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: