కొన్ని సంవత్సరాల క్రితం హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో ఓదెల అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని థియేటర్లలో కాకుండా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల చేశారు. ఈ మూవీ కి ఓ టి టి లో మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఓదెల సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ కి కొనసాగింపుగా ఓదెల 2 అందించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఓదెల పార్ట్ 2 మూవీ లో తమన్నా ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ ని ఏప్రిల్ 17 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించారు. 

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు అనగా ఏప్రిల్ 14 వ తేదీన సాయంత్రం 6 గంటలకు పార్క్ హయత్ , హైదరాబాదులో నిర్వహించనున్నట్లు ,  ఆ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ నటుడు శర్వానంద్ ముఖ్య అతిథిగా రానున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే మంచి ప్రేక్షకాదరణ పొందిన ఓదెల మూవీ కి కొనసాగింపుగా రూపొందిన మూవీ కావడంతో ఓదెల 2 పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఓదెల 2 మూవీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: