బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో హిందీ సినిమాలలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కొంత కాలం క్రితం సన్ని డియోల్ "గాదర్ 2" అనే సినిమాలో హీరో గా నటించాడు  ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. చాలా కాలం తర్వాత సన్ని డియోల్ కి గాదర్ 2 మూవీతో మంచి విజయం దక్కడంతో ఈయన మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు. ఇకపోతే తాజాగా ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన జాట్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ తాజాగా థియేటర్లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన పాజిటివ్ టాక్ ప్రేక్షకుల నుండి దక్కింది. దానితో ఈ మూవీ కి మంచి కలెక్షన్లు బాక్సా ఫీస్ దగ్గర దక్కుతున్నాయి. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కలెక్షన్లు వచ్చాయి అనే విషయాన్ని ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. 

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 32.2 ప్లస్ కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ప్రస్తుతం ఈ మూవీ కి వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ లాంగ్ రన్ లో భారీ కలెక్షన్లను వసూలు చేసే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: