టాలెంట్ ఉంటే చాలు ఎక్కడైనా రాణించగలమని దర్శకుడు వశిష్ట నిరూపించాడు. ఇండస్ట్రీలో ముందుగా ఆయన డైరెక్షన్ ను ఎవరు కూడా నమ్మలేదు. కానీ ఒక్క సినిమాతో హిట్ కొట్టి ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే సినిమా చేస్తున్నారు..అంతేకాదు ఆయన డైరెక్షన్ అని తెలియగానే  ఆ ఇద్దరు హీరోలు సినిమా ఒప్పుకొని మరి పక్కన పెట్టేశారు. వారెవరు వివరాలు చూద్దాం.. వశిష్ట చిరుతో  విశ్వంబర సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలుసు. ఈ డైరెక్టర్ తండ్రి సత్యనారాయణరెడ్డి పెద్ద నిర్మాత. ఈయన అప్పట్లో భగీరథ, బన్నీ, వంటి సినిమాలు కూడా చేశారు. అలాంటి సత్యనారాయణ రెడ్డి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కొడుకు వశిష్ట కష్టం గురించి తెలియజేశాడు.. నా కొడుకు వశిష్టకు దర్శకత్వం అంటే ఇష్టమని  ఓసారి హీరో నితిన్ తో చెప్పాను. 

ఒక మంచి కథ రెడీ చేశామని నీతో ఓ సినిమా చేద్దామని నితిన్ ను అడిగాను. ప్రొడ్యూసర్ ని కూడా పెట్టి ఆయనకు 75 లక్షలు అడ్వాన్స్ కూడా ఇప్పించా, కెమెరామెన్ గా చోటా కె నాయుడు 10 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారు. ఇక సినిమా మీద రెండు కోట్ల వరకు ఖర్చు చేశాం. చివరి సమయం వచ్చేసరికి హీరో నితిన్ మాతో సినిమా చేయనని హ్యాండ్ ఇచ్చాడు.. దీనికి కారణం అదే సమయంలో ఆ సినిమాతో  పెద్ద హిట్ అందుకున్న నితిన్ వశిష్టతో చేస్తే మళ్లీ రేంజ్ పడిపోతుంది అని భావించాడట. అందుకే నా కొడుకుతో సినిమా చేయలేదని సత్యనారాయణ రెడ్డి బాధపడ్డారు. ఇదే కాకుండా అల్లు శిరీష్ కు కూడా  కథ రెడీ చేసి చెప్పాం. 

ఆయన కూడా అన్ని ఓకే చెప్పి చివరికి శ్రీరస్తు శుభమస్తు హిట్ కొట్టడంతో ఈ కొత్త డైరెక్టర్ తో నేను చేయనని డైరెక్టుగా చెప్పేసారట. అయినా వశిష్ట తన అనుకున్నది చేయాలనుకుని 'బింబిసారా' చిత్రం చేసి అద్భుతమైన హిట్ సాధించాడు. ఈ సినిమా తర్వాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే ఆఫర్ కొట్టేశాడు.. ఓపిక, సహనం, కష్టపడే గుణం ఉంటే సక్సెస్ అదే వస్తుందని మా అబ్బాయిని చూస్తే అర్థమవుతుంది అంటూ సత్యనారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు.. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: