
అజయ్ దేవగన్, రితీష్ దేశముఖ తదితరులు ఈ చిత్రంలో నటిస్తూ ఉండగా.. తమన్నాకు సంబంధించి కొన్ని వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.
ఒక్కో పాటకు కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్న తమన్నా.. ఎక్కువగా స్పెషల్ సాంగ్ లలోనే కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే తమన్నాకు సినిమా అవకాశాలు తగ్గిపోతాయని అభిమానులు ఆందోళన కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో తమన్నా హీరోయిన్గా పెద్దగా పాత్రలో కూడా నటించడం లేదు. ఎక్కువగా బాలీవుడ్ లో వెబ్ సిరీస్లలో బోల్డ్ గ్లామరస్ గా ఉండే పాత్రలోనే నటిస్తూ ఉన్నది.. అందుకే టాలీవుడ్లో నెమ్మదిగా తమన్నా పేరు తగ్గిపోతోంది .మరి ఇలాంటి సమయంలో ఓదెల - 2 సినిమాలో తమన్నా నటిస్తూ ఉన్నది..ఇందులో ఒక విభిన్నమైన పాత్రలో నటిస్తున్నప్పటికీ ఈ సినిమా మొత్తం తమన్నా మీద ఆధారపడి ఉంది..
ఓదెల- 2 సినిమా సక్సెస్ అయితే తమన్నాకి టాలీవుడ్లో మళ్లీ తిరుగు లేదని కూడా అభిమానులు భావిస్తున్నారు. ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. అయినా కూడా వాటన్నిటిని పట్టించుకోకుండా తమన్నా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. మరి టాలీవుడ్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఓదెల - 2 సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవాలి.