మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే . ఈ మూవీ లో చిరు కి జోడిగా త్రిష నటిస్తోంది. మల్లాడి వశిష్ట ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అంది స్తూ ఉండగా ... యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని స్టార్ట్ చేశాక ఈ సినిమాను ఈ సంవత్సరం జనవరి 10 వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కానీ ఆ తర్వాత ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి భరి నుండి తప్పిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని ఈ సంవత్సరం జూలై నెలలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి రామ రామ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.

ఇక ఈ మూవీ లోని రామ రామ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ కి ప్రేక్షకుల నుండి విడుదల అయిన 24 గంటల్లో మంచి రెస్పాన్స్ లభించింది. విడుదల అయిన 24 గంటల సమయంలో విశ్వంభర మూవీలోని రామ రామ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ కి 10.05 మిలియన్ వ్యూస్ ... 145 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే విశ్వంభర మూవీ లోని రామ రామ లిరికల్ వీడియో సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: