నాచురల్ స్టార్ నాని ఈ మధ్య కాలంలో వరుస పెట్టి విజయాలను అందుకుంటూ ఫుల్ జోష్లో ముందుకు దూసుకుపోతున్నాడు. నాని ఆఖరుగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం నాని , శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న హిట్ ది థర్డ్ కేస్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. శ్రీ నిధి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను ఈ మూవీ బృందం వారు ఇప్పటికే విడుదల చేశారు.

మూవీ నుండి ఈ మూవీ బృందం వారు విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం , అలాగే ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేస్ , హిట్ ది సెకండ్ కేస్ మూవీలు కూడా మంచి విజయాలు సాధించి ఉండడంతో ప్రస్తుతం ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలా ప్రేక్షకుల్లో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొని ఉన్న సందర్భంగా ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క ప్రపంచ వ్యాప్త థియేటర్ హక్కులు దాదాపు 50 నుండి 55 కోట్ల భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ ఏకంగా 54 కోట్లకు దక్కించుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అలాగే ఈ సినిమా యొక్క ఆడియో హక్కులు ఏకంగా 6 కోట్లకు అమ్ముడు పోయినట్లు మరో వార్త వైరల్ అవుతుంది. మొత్తంగా ఈ సినిమాకు ఇప్పటి వరకు 135 కోట్ల బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా హిట్ 3 మూవీ కి అదిరిపోయే రేంజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: