టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి నందమూరి బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరస పెట్టి విజయాలను అందుకుంటూ వస్తున్న విషయం మనకు తెలిసిందే . కొంత కాలం క్రితం వరుసగా చాలా సినిమాల తో అపజయా లను ఎదుర్కొన్న బాలయ్య "అఖండ" మూవీ తో మంచి సక్సెస్ను అందుకున్నాడు . ఆ తర్వాత వరుసగా వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి , డాకు మహారాజ్ మూవీ లతో మంచి విజయాలను అందుకున్నాడు. ప్రస్తు తం బాలయ్య , బోయపాటి శ్రీను దర్శకత్వం లో అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతున్న అఖండ 2 లో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే తాజాగా బాలకృష్ణ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వృద్ధి సినిమాస్ బ్యానర్లో బాలకృష్ణ తన తదుపరి మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే బాలకృష్ణ , వృద్ధి సినిమాస్ బ్యానర్లో నటించబోయే సినిమాకు గోపీచంద్ మాలినేని దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబోలో వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. 

ఇలా ఇప్పటికే వీరి కాంబోలో రూపొందిన ఓ మూవీ మంచి విజయం సాధించడంతో వీరి కాంబోలో మరో మూవీ కనుక సెట్ అయినట్లయితే దానిపై భారీ అంచనాలు ప్రేక్షకులను అవకాశాలు ఉన్నాయి. తాజాగా గోపీచంద్ మలినేని హిందీలో సన్నీ డియోల్ హీరోగా జాట్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ తాజాగా విడుదల అయింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ప్రస్తుతం ఈ సినిమాకు మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: