
అయితే తెలుగులో అలా వైకుంఠపురం లో సినిమాకు 29 కి పైగా టిఆర్పి రేటింగ్ పాయింట్స్ తో ఆల్ టైం నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది .. అయితే దీనిని పుష్పవన్ బ్రేక్ చేయలేకపోయింది .. ఈ సినిమా కు కేవలం 25 టిఆర్పి పాయింట్స్ మాత్రమే వచ్చాయి .. కానీ ఇప్పుడు పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా లో నిన్న టెలికాస్ట్ కి వచ్చింది .. అయితే ఈసారైనా పుష్పరాజ్ బంటుగానీ లెక్కలు మార్చి కొత్త రికార్డులు తిరగరాస్తారా లేదా అనేది కూడా అందరిలో ఆసక్తిగా మారింది ..
ఇదే క్రమంలో వెంకటేష్ హీరో గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ కూడా బుల్లి తెర పై అదిరిపోయే టిఆర్పి రేటింగ్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది . కానీ అది అల్లు అర్జున్ రికార్డులను చెరపలేకపోయింది . అయితే ఇప్పుడు పుష్ప 2 సినిమా తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేసిన అల్లు అర్జున్ .. బుల్లితెర పై కూడా భారీ రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుతున్నారు .. ఇక మరి పుష్ప 2 బుల్లితెర పై కూడా టిఆర్పి రేటింగ్ లో ఎలాంటి రికార్డులు అందుకుంటుందో చూడాలి .