ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని  కుటుంబం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు .. నట సామ్రాట్ అక్కినేని  నాగేశ్వరావు తర్వాత నాగార్జున అక్కినేని కుటుంబం నుంచి నాలుగు దశాబ్దాలగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆగ్రహీరోగా వెలుగుతున్నాడు .. నాగార్జున తర్వాత ఆయన కొడుకులు నాగ‌ చైతన్య , అఖిల్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు .. అయితే వీరిలో నాగచైతన్య కాస్తూ కూస్తో  మీడియం రేంజ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు .  రీసెంట్ గానే తండేల్‌ సినిమాతో 100 కోట్ల క్లబ్లో కూడా అడుగుపెట్టాడు .. అయితే మరో అక్కినేని హీరో అఖిల్‌ మాత్రం ఇప్పటికీ సరైన విజ‌యం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు .  


ఇప్ప‌టి వ‌ర‌కు అఖిల్ ఐదు సినిమాలు చేస్తే అందులో ఒక్కటి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకు లేదు ..అఖిల్ చివరి మూవీ ఏజెంట్ బాక్సాఫీస్ వద్ద  బిగ్గెస్ట్ డిజాస్టర్ గా టాక్‌ తెచ్చుకుంది .. ఈ సినిమా తర్వాత చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకుని ఈ అక్కినేని హీరో రీసెంట్ గానే లెనిన్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు .. రీసెంట్ గానే అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మొదటి గ్లింప్స్‌ వీడియో బయటకి వచ్చింది .. అయితే ఈ సినిమా పై అంచనాలు కూడా భారీగా పెంచేసింది ఆ వీడియో .. ఈ సినిమాలో అఖిల్ పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వస్తుంది ..


ఇక ఈ సినిమా లో అఖిల్ క్యారెక్టర్ లో రెండు షేడ్స్ ఉంటాయని ..  ఈ షేడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇంటర్వెల్ లో ట్విస్ట్ కూడా ఉంటుందని వార్త బయటకు వచ్చింది .. కాగా ఈ సినిమాలో రాయలసీమ బ్యాగ్ డ్రాప్  లో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో సినిమా రాబోతుంది .. అఖిల్ మాడ్యులేషన్ కూడా పూర్తిగా చిత్తూరు యాసలోనే ఉండబోతుందట .. అలాగే ఈ సినిమాలో అఖిల్ కు జంటగా అందాల భామ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుంది .. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సితార ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి .. అలాగే ఈ సినిమాని మురళీ కిషోర్ అబ్బూరి (నందు) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు .. ఇక మరి ఈ సినిమా తో ఆయన అఖిల్ బాక్సాఫీస్ దగ్గర హిట్‌ అందుకుంటాడో లేదో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: