తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో నాని ఒకరు. ఈయన అష్టా చమ్మా అనే మూవీతో నటుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. నాని మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని మంచి గుర్తింపును కూడా తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకున్నాడు. ఇక అప్పటినుండి నాని ఎప్పుడు మంచి మంచి కథలను ఎంచుకుంటూ సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. దానితో ఈయనకు ఇప్పటివరకు ఎన్నో మంచి విజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. దానితో నటుడిగా కూడా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది.

ఇకపోతే నాని కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు నాని ఎన్నో సినిమాల్లో నటించాడు. ఎన్నో విజయాలను , అపజయాలను అందుకున్నాడు. కానీ నాని ఎప్పుడూ కూడా అత్యంత భారీ రక్త పాతం కలిగిన సినిమాల్లో హీరోగా నటించలేదు. తాజాగా నాని "హిట్ ది థర్డ్ కేస్" అనే సినిమాలో హీరో గా నటించిన మనకు తెలిసిందే. శ్రీ నిధి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మే 1 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను ఈ మూవీ బృందం వారు ఇప్పటికే విడుదల చేశారు. దాని ద్వారానే ఈ మూవీ లో భారీ రక్త పాతం కలిగిన సన్నివేశాలు ఉండనున్నట్లు అర్థం అవుతుంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ మూవీ కి ఏకంగా సెన్సార్ర్డ్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ వచ్చింది. దానితో ఈ మూవీ లో భారీ రక్త పాతం కలిగిన సన్నివేశాలు ఉండనున్నట్లు క్లియర్ గా అర్థం అవుతుంది. మరి కెరియర్లో మొట్ట మొదటి సారి నాని భారీ రక్త పాతం , యాక్షన్ కలిగిన సినిమాలో నాని నటించాడు. మరి ఈ మూవీతో నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: