ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే వారిలో చాలా మంది మోడలింగ్ రంగం నుండి వస్తున్నారు. అలా మోడలింగ్ రంగం నుండి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో ఎంతో మంది ముద్దుగుమ్మలు అద్భుతమైన స్థాయికి చేరుకున్న వారు కూడా ఉన్నారు. ఇకపోతే మోడలింగ్ రంగం నుండి సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో మనుషి చిల్లర్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ మిస్ వరల్డ్ కిరీటాన్ని కూడా గెలుచుకుంది. మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న తర్వాత ఈమె సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మొదటగా అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన సామ్రాట్ పృథ్వీరాజ్ అనే హిందీ సినిమాతో ఈ బ్యూటీ వెండి తెరకు పరిచయం అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే ఈమె కొంత కాలం క్రితం వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తో ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

సినిమా కూడా ఈ ముద్దుగుమ్మకు నిరాశనే మిగిల్చింది. ఇకపోతే ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. అందులో చాలా వరకు ఈ బ్యూటీ కి సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ కూడా అవుతున్నాయి. తాజాగా కూడా మనిషి చిల్లర్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: