
ఇక సల్మాన్ ఖాన్ విషయానికి వస్తే.. 1998లో కృష్ణ జింకను చంపిన కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే.అయితే కృష్ణ జింకను ఆరాధ్య దైవంగా భావించే భీష్ణోయ్ వర్గం వారు అప్పటినుంచి సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేస్తూ ఇలా హత్య బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇక అంతే కాదు గత ఏడాది ఏప్రిల్ నెలలో ముంబైలో సల్మాన్ ఖాన్ నివాసం ఉంటున్న గెలాక్సీ అపార్ట్మెంట్లో ఉండే తన ఫ్లాట్లో కూడా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఇద్దరు దుండగులు బైకుపై వచ్చి కాల్పులు జరిపారు. ఇక తర్వాత బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఫెన్సింగ్ ను తన ఇంటికి వేయించుకున్నారు సల్మాన్ ఖాన్.
అంతేకాదు మరొకవైపు బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్ అక్కడికి కూడా భద్రత బలగాలతో వెళ్లారు.ప్రస్తుతం బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్న ఈయన ఈమధ్య ఒక మూవీ ప్రమోషన్స్ లో పాల్గొని అంతా దేవుడి దయ.. ఎన్ని రోజులు బ్రతకాలని ఉందో అంతవరకు నేను బ్రతుకుతాను.. అంటూ సల్మాన్ ఖాన్ తెలిపారు. ఇక ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి